ప్రతి పల్లె దేశానికి ఆదర్శం కావాలి


Sun,September 8, 2019 03:02 AM

చిన్నచింతకుంట : తెలంగాణలోని పల్లెలను దేశంలోనే ఆదర్శంగా రూపుదిద్దుకోవాలనే సంకల్పంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించారని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని బండార్‌పల్లి గ్రామంలో జెడ్పీ చైర్‌పర్సన్ పర్యటించారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై మాట్లాడారు. 30రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుకు అం దరూ సిద్ధం కావాలన్నారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా అందరి భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. మారుతున్న కాలనికి అనుగుణంగా గ్రామ పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి గ్రామం పరిశుభత్ర, పచ్చదనంతో కళకళలాడాలని, ఇందుకు అందరూ సమిష్టి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ టప్ప సతీశ్‌కుమార్, ఉప సర్పంచ్ నర్సింహ, మాజీ సర్పంచులు సువర్ణ ఆంజనేయులు, మహేశ్‌గౌడ్, నాయకులు కత్తెరాజు, రాజు, శివ, మైబోలి, నరేందర్ పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...