మళ్లీ భారీ వరద


Sat,September 7, 2019 02:00 AM

-కృష్ణమ్మకు తోడైన భీమా, తుంగభద్ర
-శ్రీశైలానికి భారీగా ఉరకలు వేస్తున్న నీలవేణి
-జూరాలకు 2 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
-17 గేట్ల ద్వారా దిగువకు
-రేపు శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం


మహబూబ్ నగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ/అయిజ/అమ్రాబాద్ రూరల్ : జూరాల ప్రాజెక్టుకు మళ్లీ వరద పోటెత్తుతోంది. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో శుక్రవారం జూరాల ప్రాజెక్టుకు 1.95 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో జూరాల అధికారులు వచ్చిన వరదను అలాగే దిగువకు విడుదల చేస్తున్నారు. శుక్రవారం రాత్రికి జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1.95 లక్షలు, అవుట్ ఫ్లో 2.03 లక్షల క్యూసెక్కులుగా ఉం ది. ఆ ల్మట్టి, నారాయణపుర నుంచి వరద ప్రభావం మరింతగా పెరిగేందుకు అవకాశం ఉంది. ఇక భీమా నదిపై ఉన్న ఉజ్జయిని ప్రాజెక్టు నుంచి కూడా సుమారు 34వేల క్యూసెక్కుల వరద జూరాల వైపు వస్తున్నది. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీ వరద వస్తున్న తరుణంలో జూరాలపై ఆధారపడిన ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

2 లక్షల క్యూసెక్కుల అవుట్‌ఫ్లో
గత నెల 1వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కృష్ణా నదికి భారీగా వరదలొచ్చాయి. జూరాల ప్రాజెక్టుకు సు మారు 10 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో నమోదైంది. తర్వాత క్రమేనా ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరదలు తగ్గాయి. క్రమంగా ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ తరుణంలో ఎగువన మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నందున తిరిగి వరద ప్రారంభమైంది. మరోవైపు భీమానదిపై ఉన్న ఉజ్జయిని ప్రాజెక్టుకు శుక్రవారం 70వేల ఇన్‌ఫ్లో ఉండగా, 34 వేల వరద జూరాల వైపునకు వదిలా రు. అటు నారాయణపుర నుంచి కృష్ణా, ఇటు ఉజ్జయిని నుంచి భీమా నదుల వరద జూరాలకు చేరుకుంటోంది. జూరాల నుంచి 17 గేట్లు ఎత్తి 165703 క్యూసెక్కులు, కరంటు ఉత్పత్తి ద్వారా 31882 క్యూసెక్కులు నదిలోకి వదులుతున్నారు. నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, జూరాల కాలువలకు పూర్తి స్థాయిలో నీటి విడుదల కొనసాగుతున్నది. మొత్తంగా జూరాల నుంచి 2.03 లక్షల క్యూసెక్కుల అవుట్ ఫ్లో నమోదు అవుతున్నది.

ప్రాజెక్టులకు కొనసాగుతున్న నీటి విడుదల
జూరాల ప్రాజెక్టుపై ఆధారపడిన అన్ని ప్రాజెక్టులకు నిరంతరం నీటి విడుదల సాగుతోంది. శుక్రవారం సా యంత్రం నాటికి జూరాల పూర్తి నీటిమట్టం 9.657 టీఎంసీలకు గాను ప్రాజెక్టును 8.949 టీఎంసీల స్థాయిలో ఉంచి ఎగువ నుంచి వస్తున్న 1.95 లక్షల క్యూసెక్కుల వరదను ప్రాజెక్టు నుంచి వదులుతున్నా రు. జూరాల 17 గేట్లు ఎత్తి 165703 క్యూసెక్కులు, కరంటు ఉత్పత్తి ద్వారా 31882 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నెట్టెంపాడుకు 1500, భీమా(1)కి 1300, కోయిల్‌సాగర్‌కు 630, భీమా (2)కు 750 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఇక జూరాల కుడి కాలువకు 698, ఎడమ కాలువకు 1000, సమాంతర కాలువకు 650 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. జూరాల పరిధిలో అన్ని ప్రాజెక్టులు క్రమంగా పూర్తి నీటి మట్టం స్థాయికి చేరుకుంటున్నాయి.

శ్రీశైలానికి కృష్ణమ్మ
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 1,01,608 క్యూసెక్కులు నాగార్జున సాగర్ వైపు వదులుతున్నారు. శుక్రవారం జూరాల స్పిల్ వే ద్వారా 1,65,922 క్యూసెక్కులు, విద్యుత్ కేంద్రం ద్వారా 31,882 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, 268.725 టీఎంసీల సామర్థ్యం ఉన్నది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో శుక్రవారం సాయంత్రం వరకు 871.10 అడుగులు కాగా, 183.4198 టీఎంసీల నీరు ఉన్నది.

ఆర్డీఎస్ ఆనకట్టకు భారీగా వరద
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద వస్తోంది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు ఆర్డీఎస్ ఆనకట్టకు నీటి ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. వర్షాలకు తోడు టీబీ డ్యాం నుంచి భారీగా దిగువకు వరద నీటిని విడుదల చేయడంతో ఆర్డీఎస్ ఆనకట్టకు వరద ఉధృతంగా చేరుతోంది. శుక్రవారం ఆర్డీఎస్ ఆనకట్టకు 86,776 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, ఆనకట్టపై 86,170 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో ఉంది. ఆర్డీఎస్ ఆనకట్ట నుంచి ఆయకట్టుకు 595 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆర్డీఎస్ డీఈఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 11.5 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు డీఈఈ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని సింధనూరు హెడ్‌రెగ్యులేటర్ సమీపంలో 350 క్యూసెక్కులు ఆయకట్టుకు చే రుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. టీబీ డ్యాం నుంచి విడుదల చేస్తున్న 88,848 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తుండటంతో శనివారం ఆర్డీఎస్ ఆనకట్టకు చేరుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

పొంగుతున్న తుంగభద్ర
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు అప్పర్ తుం గ, భద్ర నదులకు వరద ఉధృతంగా ఉండటంతో అప్పర్ తుంగ, భద్ర ప్రాజెక్టుల నుంచి వరద నీటిని దిగువన ఉన్న తుంగభద్ర జలాశయానికి విడుదల చేస్తున్నారు. శుక్రవారం తుంగభద్ర జలాశయానికి 57,496 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, 20 గేట్లు 2.5 అడుగులు, 8 గేట్లు అడుగు మేర ఎత్తి స్పిల్‌వే ద్వారా లక్ష 240 క్యూసెక్కులను నదిలోకి విడుదల చేస్తున్నారు. కర్ణాటక, ఏపీ రాష్ర్టాలకు చెందిన కాల్వలకు 11,070 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 100.855 టీఎంసీల నీటి నిల్వకు గాను ప్ర స్తుతం 99.278 టీఎంసీలను నిల్వ ఉంచినట్లు టీబీ డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ తెలిపారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...