నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి


Sat,September 7, 2019 01:58 AM

నారాయణపేట రూరల్: వినాయక నిమర్జనానికి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ప్రజావాణి హాల్‌లో ఏర్పాటు చేసిన కోఆర్డినేట్ సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలోని మక్తల్, నారాయణపేట, ఊట్కూర్‌లో గణేష్‌శోభాయాత్రలో అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు సూచించించారు. రహదారులు సరిగాలేనిచోట రహదారులకు మట్టివేసి సరిచేయాలని ఆర్‌ఎన్‌బీ అధికారులకు సూచించారు. సమష్యాత్మక ప్రాంతాలు గుర్తించి ప్రత్యేక అధికారులను ఏర్పాటుచేసి శాంతియుతంగా జరిగేలా చూడాలని పోలీసులకు సూచించారు. ఎస్పీచేతన మాట్లాడుతూ గణేష్‌నిమజ్జనం, మొహర్రం ఒకేసారి ఉండటం వల్ల జిల్లాలో ఎలాంటి అవాంచనీయ సంఘటణలు చోటుచేసుకోకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్ డీఎస్పీ శ్రీధర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ విద్యుత్ డీఈ చంద్రమౌలి తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...