భీమాకు కొనసాగుతున్న నీటి విడుదల


Sat,September 7, 2019 01:58 AM

-సంగంబండకు 800, భూత్పూరుకు 500 క్యూసెక్కుల నీటి విడుదల
మక్తల్ రూరల్ : రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకంలో భాగమైన ఫేజ్-1కు కృష్ణానది నుంచి వరదనీటి ఎత్తిపోత నిరంతరాయంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా వరుసగా 39వ రోజైన శుక్రవారం నీటి పంపింగ్ నిరంతరాయంగా కొనసాగింది. మక్తల్ మండలంలోని చిన్నగోప్లాపూర్ పంప్‌హౌస్ నుంచి రెండు మోటర్ల ద్వారా మొత్తం 1300 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తుండగా, సంగంబండలోని చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు 800 క్యూసెక్కులు, భూత్పూరు జలాశయానికి 500 క్యూసెక్కుల నీటిని కాల్వల ద్వారా మళ్లిస్తున్నారు. సంగంబండ పూర్తి సామర్థ్యం 3.317టీఎంసీలకు గానూ ప్రస్తుతం 2.43టీఎంసీలు, భూత్పూరు జలాశయం పూర్తి సామర్థ్యం 1.313టీఎంసీలకు గానూ ప్రస్తుతం 1.26టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు భీమా ఈఈ విజయానంద్ తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టుల నుంచి కుడి, ఎడమ కాల్వల ద్వారా 670 క్యూసెక్కుల నీటిని ఆయకట్టు భూములకు విడుదల చేస్తున్నామని ఈఈ వెల్లడించారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...