ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి


Sat,September 7, 2019 01:57 AM

నారాయణపేట, నమస్తేతెలంగాణ: విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి మూలం ప్రశ్నించేతత్వమని, విద్యార్థులు తమ ఉపాధ్యాయులు, తమ తల్లిదండ్రులను పశ్నించాలని.. అదేవిధంగా తమను తాము ప్రశ్నించుకున్నప్పుడే దేనినైనా సాధించగలరని నారాయణపేట ఎస్పీ డాక్టర్ చేతన అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని శ్రీసరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాల ఆవరణలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లా విభాగ్ గణిత విజ్ఞాన మేళా కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. పాఠశాల గౌరవ అధ్యక్షుడు కొత్తకాపు రతంగ్‌పాండురెడ్డి అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎస్పీ డాక్టర్ చేతన, డీఎస్పీ శ్రీధర్, రిటైర్డ్ తాసిల్దార్, శ్రీసరస్వతీ శిశుమందిర్ పాఠశాలల జిల్లా అధ్యక్షుడు మద్ది అనంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె బహుమతుల ప్రదానం చేసి మాట్లాడారు.

అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విజ్ఞాన మేళాను సందర్శించి, విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి నుంచి సమాధానాలను తెలుసుకున్నారు. ముఖ్యవక్తగా హాజరైన విభాగ్ అధ్యక్షుడు శ్రీనివాసయ్య విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో ఎస్సై శ్రీనివాస్, వనపర్తి జిల్లా అధ్యక్షుడు విజయ్, నారాయణపేట జిల్లా అధ్యక్షుడు బాల్‌రాజ్, నాగర్‌కర్నూల్ జిల్లా కార్యదర్శి బాల్‌రాజ్, విభాగ్ కార్యదర్శి ఎల్లప్ప, ఉమ్మెత్తల మహేశ్వర్, సింగిల్ విండో అధ్యక్షుడు సత్యయాదవ్, జిల్లా కార్యదర్శి సీతరాములు, ఉన్నత పాఠశాల కార్యదర్శి పటేల్ శ్రీనివాస్‌రెడ్డి, ప్రభాకర్, ప్రచార కార్యదర్శి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...