ప్రజల ఆలోచనలో మార్పు రావాలి


Sat,September 7, 2019 01:57 AM

భూత్పూర్ : గ్రామాల అభివృద్ధి కోసం ప్రజల ఆలోచనల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కొత్తమొల్గర గ్రామంలో 30రోజుల ప్రణాళికా సమావేశంలో ఎమ్మెల్యే ఆల పాల్గొని మాట్లాడారు. ప్రజలు తమతమ గ్రామాల అభివృద్ధి కోసం నిత్యం కొంతైనా ఆలోచించాలని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వం చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం, హరితహారం కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. గ్రామాల్లో స్వచ్ఛందంగా శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. కాగా, గ్రామ సభలో కోఆప్షన్‌గా సభ్యుడిగా మలిశెట్టి ప్రతాప్‌ను సర్పంచ్ వెంకటమ్మ నియమించారు. కార్యక్రమంలో ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, ఇన్‌చార్జి ఎంపీడీవో శ్రీహరి, ప్రత్యేకాధికారి రాజీవ్‌రెడ్డి, మండల కోఆర్డినేటర్ నర్సింహాగౌడ్, వైస్ ఎంపీపీ నరేశ్ గౌడ్, ఉప సర్పంచ్ మురళీ, సింగిల్‌విండో డైరెక్టర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...