పల్లెల సమగ్ర అభివృద్ధికే 30 రోజుల ప్రణాళిక


Sat,September 7, 2019 01:56 AM

రాజాపూర్ : గ్రామాలు సమగ్ర అభివృద్ధి సాధించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన పంచాయతీ రాజ్ చట్టం ద్వారా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని జడ్చర్ల ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం చేపట్టిన 30 రోజుల ప్రణాళిక అమలులో భాగంగా శుక్రవారం బాలానగర్ మండలంలోని గుండేడ్, రాజాపూర్ మండలంలోని గుండ్లపొట్లపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించి సర్పంచులు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం ఆయా గ్రామాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తూనే, గ్రామాల అభివృద్ధి, ప్రజా అరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ఇందు లో భాగంగా 30 రోజుల్లో సంవత్సరానికి సరిపడే ప్రణాళిక రూపొందించాలని సూచించారు. 500 జనాభా కల్గి న చిన్న పంచాయతీకి ప్రభుత్వం రూ.8లక్షల సంవత్సరానికి అందిస్తుందని, ప్రతి గ్రామంలో వార్డు సభ్యులతో కలిసి గ్రామ అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామంలో ప్రభుత్వ స్థలాలను గుర్తించి మొక్కలు నాటి పెంచాలన్నారు.

గుండ్లపొట్లపల్లి గ్రామం లో ఇంటింటికీ చెత్త బుట్టలు పంపిణీ చేయడంతోపాటు, తడి పొడి చెత్త తరలింపునకు డంపింగ్ యార్డులను ఏ ర్పాటు చేసి చెత్త సేకరణకు తన సొంత మోటర్ సైకిల్‌తో బండిని తయారు చేసిన సర్పంచ్ రాఘవేందర్‌రెడ్డిని ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి అభినందించారు. కార్యక్రమంలో ఎంపీపీలు కమల, సుశీల, జెడ్పీటీసీలు కళ్యాణి, మోహన్ నాయక్, వైస్ ఎంపీపీలు మహిపాల్‌రెడ్డి, వెంకటాచా రి, టీఆర్‌ఎస్ సహాయ కార్యదర్శి వాల్యానాయక్, ఎంపీడీవో లక్ష్మీదేవి, తాసిల్దార్ నర్సింగ్‌రావు, వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, శ్రీనివాస్‌రావు, లక్ష్మణ్ నాయక్, ఎంపీటీసీ సునీత, సర్పంచులు రాఘవేందర్‌రెడ్డి, బచ్చిరెడ్డి, సత్యయ్య, నర్సింహులు వెంకట్ నాయక్, రఘువీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...