నవ సమాజ నిర్మాతలు మీరే


Fri,September 6, 2019 04:30 AM

-ఉద్యమంలో మీ పాత్ర కీలకం
-మా నాన్నే.. నా తొలి గురువు
-ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
-గురువుల స్థానం గొప్పది : ఎంపీ మన్నె
-తల్లిదండ్రుల తర్వాత ఆచార్యులే : జెడ్పీ చైర్‌పర్సన్

స్టేషన్ మహబూబ్‌నగర్ : సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. దివంగత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని గురువారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డిలతో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసిన ఉపాధ్యాయులకు పురస్కారం అం దించడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు ఉపాధ్యాయులేనని తెలిపారు. తాను ఉపాధ్యాయుడి బిడ్డనేనని, నా గురువు మా నాన్నే అని గుర్తు చేశారు. మనమందరం సర్కారు బడిలో చదివి ఈ స్థాయిలో ఉన్నామని తెలిపారు. 9వ తరగతిలో జరుపుకున్న స్వయం పారిపాలన దినోత్సవంలో తాను హెచ్‌ఎంగా వ్యవహరించానని, కమిషనర్ అయిన తర్వాత కూడా హెచ్‌ఎం కావాలనే కోరిక ఉండేదన్నారు. తాను రాజకీయాల్లోకి వస్తానని ఏ రోజూ కూడా అనుకోలేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. జిల్లా అభివృద్ధికి అన్నివిధాలా కృషి చేస్తానని పేర్కొన్నారు.

గురువు స్థానం గొప్పది..ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి
గురువుల స్థానం ఎంతో గొప్పదని మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యుడు మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పి ఉన్నత శిఖరాలకు ఎదిగేలా కృషి చేస్తారన్నారు. నేటి బాలలే రేపటి భావిభారత పౌరులని, వారి చేతుల్లోనే దేశం భవిష్యత్తు ఉందన్నారు. విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రభు త్వం అన్నివిధాలా కృషి చేస్తుందని తెలిపారు.

ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది..
-జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి
మట్టిలోని మాణిక్యాలను వెలికితీసే ఉపాధ్యాయ వృ త్తి ఎంతో పవిత్రమైందని జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి అన్నారు. తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువులకే ఉందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ స్వర్ణలత, జెడ్పీ సీఈవో యాదయ్య, డీఈవో నాంపల్లి రాజేశ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...