మొక్కలు పెంచి కాలుష్యాన్ని నిర్మూలించాలి


Fri,September 6, 2019 04:28 AM

దేవరకద్ర,నమస్తే తెలంగాణ : ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచి కాలుష్యాన్ని నిర్మూలించాలని రవాణా శాఖ జిల్లా అధికారిణి దుర్గా ప్రమీల అన్నారు. గురువారం మండలంలోని డోకూర్ తపోవన్ పాఠశాలల్లో నిర్వహించిన హరతహారం కార్యక్రమంలో ఆమె పాల్గొని విద్యార్థులు, గ్రామస్తులతో కలిసి సుమారు 500 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వన సంపద రోజురోజుకూ తగ్గిపోవడంతో వాతావరణ సమతుల్యం దెబ్బతిందన్నారు. రాష్ట్రంలో అటవీ శాతాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి పెంచాలని కోరారు. విద్యార్థులు నాటే మొక్కలను దత్తత తీసుకొని పెంచాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ రామకృష్ణారెడ్డి, ఎంపీటీసీ యజ్ఞ భూపాల్‌రెడ్డి, ఏపీవో భారతి, పాఠశాల ప్రిన్సిపాల్ వార్కిటి నిరంజన్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...