అర్హులైన జర్నలిస్ట్‌లకు డబుల్ బెడ్‌రూంల మంజూరు


Fri,September 6, 2019 04:27 AM

కోయిలకొండ : జిల్లాలో అర్హులైన జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూంలు మంజూరు చేస్తామని పేట ఎమ్మెల్యే ఎస్ రాజేందర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని టీయూడబ్ల్యూజే నాయకులతో ఆయన గురువారం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు అందించడం జరిగిందని, దీంతో పాటు జర్నలిస్ట్ సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసి నిధులు కేటాయించి అన్ని విధాలా ఆదుకోవడం జరుగుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా మండల టీయూడబ్ల్యూజే నాయకులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే నాయకులు కిరణ్, పవన్‌గౌడ్, రఘురామాచారి, పీ నర్సింహులు, జే నర్సింహులు, రాఘవేందర్‌రావు, మల్లిఖార్జున్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...