సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి


Fri,September 6, 2019 04:27 AM

మహబూబ్‌నగర్ వైద్యవిభాగం : సర్కారు వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం ప్రభుత్వ జనరల్ దవాఖానను ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంత్రి సందర్శించి పరిశీలించారు. దవాఖానలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. దవాఖానలోని ప్రధాన విభాగాలతోపాటు, డెంగ్యూ రోగులకు ప్లేట్ లెట్స్ అందించేందుకు గాను లక్షల రూపాయలతో తెచ్చిన సింగిల్ డోనర్, ఆర్డీ యంత్రాలను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల అందరూ అప్రత్తమంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ దవాఖానకు గతంలో ఎవరూ రాని పరిస్థితి ఉండేదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ దవాఖానపై నమ్మకం కలిగేలా అన్ని వసతులు, పరికరాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. కేసీఆర్ కిట్ ప్రారంభించిన తర్వాత ప్రసవాలు పెరగడంతోపాటు అన్ని రకాల శస్త్ర చికిత్సలు, వైద్య సేవలు భారీగా పెరిగాయన్నా రు. సీజనల్ వ్యాధులపై ప్రజలు భయపడనవసరం లేదని, ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నామన్నారు. గత ఐదేండ్ల కిందట కంటే ప్రభుత్వ దవాఖానలో అత్యాధునిక పరికరాలు, వసతులు కల్పించి కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు.

జనరల్ దవాఖానలో రూ.2.3కోట్లతో డిజిటల్ ఎక్స్‌రే, సీటీ స్కాన్ తదితర అత్యాధునిక వైద్యం ప్రజలకు అందుతుందన్నారు. ఆగస్టులో 750 మందికి డెంగ్యూ పరీక్షలు చేయగా, 94 మందికి పాజిటివ్ నిర్దారణ అయ్యిందని, వారికి దవాఖానల్లో వైద్య సేవలు అందించి క్షేమంగా ఇంటి కి తరలించాలని తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో వైద్యులు, సిబ్బంది అందరూ స్థానికంగా, అప్రమత్తంగా ఉండి నిరంతరం వైద్య సేవలు అందించాలని సూచించారు. 15 రోజుల్లో మెడికల్ కళాశాల నూతన భవన ప్రారంభోత్సవం ఉంటుందని, వైద్య సేవలలో ఇబ్బందులు తలెత్తకుండా నెల రోజుల్లో స్టాఫ్ నర్సులతో పాటు, ఇతర సిబ్బందిని భర్తీ చేస్తామన్నారు. సమావేశంలో దవాఖాన సూపరింటెండెంట్ రాంకిషన్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ఐఎంఎ అధ్యక్షుడు రామ్మోహన్, రిటైర్డ్ సూపరింటెండెంట్ శ్యామ్యూల్, సీహెచ్‌వో భీంరెడ్డి, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణరెడ్డి, మధుసూధన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...