ప్రతి ఎకరాకు కృష్ణ జలలు


Thu,September 5, 2019 12:26 AM

-వచ్చే వానకాలానికి సాగునీళ్లిస్తాం
-పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వాలి
-ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
-త్వరలోనే రైతుల రుణమాఫీ చేస్తాం
-వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
-హన్వాడలో జలశక్తి అభియాన్, రైతు మేళా

హన్వాడ : బీడు భూముల్లో కృష్ణమ్మను పారిం చి సస్యశ్యామలం చేస్తామని ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం మం డల కేంద్రంలో జలశక్తి అభియాన్‌పై ప్రజాప్రతినిధులు, రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు, వ్యవసా య శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హాజరయ్యారు. ముందుగా నీటి సంరక్షణపై రైతులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ నివాస్‌గౌడ్ మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హాదా క ల్పించి పనుల పూర్తి కోసం రూ.20వేల కోట్లు మంజూరు చేయాలన్నారు. వచ్చే వానాకాలం నా టికి పాలమూరు-రంగారెడ్డి పోత్తిపోతల పథకం ద్వారా రైతాంగానికి సాగునీళ్లు అం దిస్తామన్నారు. ఈ పథకంతో జిల్లా సస్యశ్యామ లం అవుతుందన్నారు. హన్వాడ మండలానికి సంబంధించి ఉ దండాపూర్ రిజర్వాయర్ నుంచి ఒక కాల్వ, కర్వె న నుంచి మరో కాల్వ వస్తుందన్నారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా శ్రీశైలం నుం చి నీళ్లు తీసుకొచ్చి ఇంటింటా నల్లా ఏ ర్పాటు చేసి తాగునీరు అందిస్తున్నామ ని తెలపారు. మండలంలో రూ.3 కో ట్లతో పాంఫండ్స్, రూ.2కోట్లతో మి ష న్ భగీరథ పనులు, రూ.7కోట్లతో తా గునీటి బావులు ఏర్పాటు చేశామని పే ర్కొన్నారు. తక్కువ నీటితో ఎక్కువ సా గు చేసే పంటలను రైతులు ఎంచుకోవాలని సూచించారు. హరితహారంలో భా గంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు.\

త్వరలోనే రైతు రుణమాఫీ
-వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
రైతులకు త్వరలోనే రుణమాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నా రు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. మన రాష్ట్రంలోనే చెరువులు, కుంటలు ఎక్కువగా ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన అనతికాలంలోనే మిషన్ కాకతీయ పథకాన్ని అమలు చేస్తే, ఐదేండ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టిందని పేర్కొన్నారు. ఇక్కడి ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరితే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు 24గంటల విద్యుత్, పంట పెట్టుబడి సాయం, రైతు బీమా తదితర పథకాలను అమలు చేస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ప్ర భుత్వానికే దక్కిందన్నారు. పాలమూరు-రంగారె డ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, భూగర్భజలాలను పెంపొందించేందుకు ప్రతి ఇంటి దగ్గర ఇంకుడు గుంతను నిర్మించుకోవాలని సూచించారు. ఇందుకు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు కృషి చేయాలన్నారు. అలాగే, రైతులు తమ వ్యవసాయ పొలాల్లో నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చే స్తున్న పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మండల కేంద్రంలో వ్యవసాయ, పశు సంవర్ధక, ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. డ్రిప్ ద్వారా ఎలా పంట సాగు చేయాలి, ఏ దశలో మందులు వాడా లి, యంత్రాల ద్వారా వరినాటు వేసే విధానాన్ని రైతులకు వివరించారు. అలాగే, అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, జలశక్తి అభియాన్ జిల్లా ఇన్‌చార్జి స్నేహలత, ఆత్మ పీడీ హూకే నాయక్, జేడీ సుచరిత, జెడ్పీటీసీ విజయనిర్మల, ఎంపీపీ బాల్‌రాజ్, ఎంపీడీవో నటరా జ్, ఏవో కిరణ్‌కుమార్, సర్పంచ్ రేవతి, ఎంపీటీసీలు కల్పన, సత్యమ్మ, టీఆర్‌ఎస్ మండల అ ధ్యక్ష, కార్యదర్శులు కొండ లక్ష్మయ్య, కృష్ణయ్యగౌ డ్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ అ నంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ర్టాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ : రాష్ర్టాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డిలు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ సమీపంలో రూ.25లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును వారు ప్రారంబించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. జిల్లా కేంద్రం లో ఐటీ పార్కు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం కాలనీలో మొక్కలు నాటారు. అనంతరం కాలనీ మహిళలు మంత్రుల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్ సురేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, మాజీ మున్సిపల్ వైస్ చై ర్మన్ రాములు, నాయకులు జయదేవ్, సాయిలు, శ్రీనివాస్, గోపాల్ యాదవ్, కృష్ణమోహన్, ఎం ఈ సత్యనారాయణ పాల్గొన్నారు.

రోడ్డు విస్తరణ పనుల పరిశీలన
జిల్లా కేంద్రంలో చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి మ్యాప్‌ను ఆయన పరిశీలించారు.

గణనాథుడికి పూజలు
రైల్వేస్టేషన్ సమీపంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడికి మం త్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డిలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కా ర్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో నా యకులు బెక్కెం జనార్దన్, కృష్ణమోహన్, గోపాల్ యాదవ్, రాములు పాల్గొన్నారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...