జీహెచ్‌ఎం,మరోముగ్గురు సస్పెన్షన్


Thu,September 5, 2019 12:15 AM

నవాబ్‌పేట: మండలంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో చోటుచేసుకున్న టీచర్ల జీపీఎఫ్ నిధుల అవకతవకల భాగోతం తిలాపాపం.. తలాపిడికెడు చందంగా మారింది. నిధుల గోల్‌మాల్‌లో ప్రమేయం ఉన్న యన్మన్‌గండ్ల జీహెచ్‌ఎం దశరథ్‌నాయక్‌తోపాటు మరో ఉపాధ్యాయుడు జహీర్‌హుస్సేన్, అటెండర్ కిరణ్‌కుమార్, జెడ్పీ కార్యాలయ అటెండర్ యూసుఫ్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రొనాల్డ్‌రోస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంఈవో రాజునాయక్ తెలిపారు. ఎంఈవో రాజునాయక్ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని కొండాపూర్, హజిలాపూర్ మహిళా టీచర్లు మెరోలిన్, నసీంభానుకు చెందిన జీపీఎఫ్ నిధులు వారికి తెలియకుండానే 2016 సంవత్సరంలో స్వాహా చేసిన సంఘటనలో నలుగురిపై సస్పెన్షన్ వేటుపడినట్లు చెప్పారు.

ఇద్దరు మహిళా టీచర్లకు చెందిన రూ.2లక్షల 90వేలు వారి ప్రమేయం లేకుండానే డ్రా చేసినట్లు చెప్పారు. అప్పట్లో ఎమ్మార్సీ కార్యాలయంలో పనిచేసిన ఉపాధ్యాయుడు జహీర్‌హుస్సేన్ ఫారాలు నింపి చెక్కులు రాసినట్లు చెప్పారు. కాగా ఈ చెక్కులపై అప్పటి ఎంఈవోగా ఉన్న దశరథ్‌నాయక్ సంతకాలు చేయగా.. ఆఫీస్ అటెండర్ కిరణ్‌కుమార్ బ్యాంకులో డబ్బులు డ్రా చేసినట్లు చెప్పారు. కాగా జెడ్పీ కార్యాలయంలో పనిచేసే టైపిస్ట్ యూసుఫ్ ఈ నిధులు డ్రా చేసేందుకు శాఖాపరంగా సహకరించినట్లు చెప్పారు. డ్రా చేసిన నిధులు టీచర్లకు ఇవ్వకుండా వారే స్వాహా చేసినట్లు తెలిపారు. ఈ సంఘటనపై విచారణ జరిపిన డీఈవో రాజేష్ కలెక్టర్‌కు నివేదించారు. దీంతో కలెక్టర్ బుధవారం సస్పెండ్ చేసినట్లు తెలిపారు

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...