రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి సేవలు చిరస్మరణీయం


Fri,August 23, 2019 02:14 AM

ప్రజా సంక్షేమం కోసం రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి చేసిన కృషి అభినందనీయమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డిలు అన్నారు. గురువారం రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి జయంతిని సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేందుకు రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి విశేష సేవలందించారని కొనియాడారు. అనంతరం రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో పేద మహిళకు రూ.25వేలు, ఇద్దరు ఎంబీబీఎస్ విద్యార్థులకు రూ. 25వేల చొప్పున మంత్రి, ఎంపీలు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ రాధాఅమర్, రెడ్డి సేవా సమితి నేతలు సురేందర్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి , మల్లు నర్సింహారెడ్డి, టీఆర్‌ఎస్ నేత కోరమోని వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...