23న రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ టోర్నీ


Wed,August 21, 2019 02:10 AM

మహబూబ్‌నగర్ స్పోర్ట్స్ : తెలంగాణ రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లాల సీనియర్, సాఫ్ట్ బాల్ చాంపియన్ షిప్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు జిల్లా సాఫ్ట్ బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్ తెలిపారు. మంగళవారం స్టేడియం మైదానంలో ఏర్పాట్లను పరిశీలించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు అమరేందర్‌రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రతిభ గల క్రీడాకారులకు కొదువలేదని, ఎంతో మంది జాతీయ స్థాయిలో రాణించారని గుర్తు చేశారు. జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి టోర్నీలో జిల్లా జట్టు క్రీడాకారులు ప్రతిభచాటి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులకు అన్నివిధాలా సహకారం అందిస్తామని తెలిపారు. అందరి సహకారంతో టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహిస్తామని, అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్య క్రమంలో రిటైర్డ్ పీడీ చెన్నవీరయ్య, మాజీ కౌన్సిలర్ విఠల్‌రెడ్డి, సాఫ్ట్ బాల్ కోచ్ సాధిక్ అలీ, పీఈటీలు పుష్ప, ఉమ, సుగుణ, స్వప్న, జ్యోతి, సత్య నారాయణ, రాజు, శ్రీనివాసులు, ఆనంద్, పీ శ్రీనివాసులు, రఘు, నాగరాజు, వెంకటయ్య పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...