కేంద్ర హోం సహాయ మంత్రిని బర్త్ఫ్ చేయాలి


Wed,August 21, 2019 02:09 AM

మహబూబ్‌నగర్ క్లాక్‌టవర్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు కిషన్‌రెడ్డిని వెంటనే బర్త్ఫ్ చేయాలని తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సింహ డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం అంబేద్కర్ కళాభవనంలో తెలంగాణ మాలమహానాడు జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆయన హాజరై మాట్లాడుతూ.. కేంద్ర న్యాయశాఖ మంత్రి రాజునాథ్‌సింగ్‌ను ఎస్సీ వర్గీకరణ చేయమని ఒత్తిడి చేయడం.. మందకృష్ణ మాటలు విని ఆయనతో ఎస్సీ వర్గీకరణ గురించి చర్చించడం ఎంతవరకు సమంజసమన్నారు. ఎస్సీ వర్గీకరణకు బీజేపీ మద్దతు ఇస్తే తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీజేపీని బొందపెడుతామన్నారు. ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇవ్వడం కిషన్‌రెడ్డి మానుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మిట్టమీది నాగరాజు, నేతలు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...