భగీరథ వృథానీరు రైతులకు అనుసంధానం


Wed,August 21, 2019 02:06 AM

మహబూబ్‌నగర్ తెలంగాణ చౌరస్తా: మహబూబ్‌నగర్ మండలంలోని మన్యంకొండపై మిషన్ భగీరథ పథకం ద్వారా మహబూబ్‌నగర్‌కు ఫిల్టర్ నీళ్లు అందిస్తుంది. వేస్టేజ్ నీళ్లు వృథాగా కొండపై నుంచి దేవరకద్ర నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు వృథాగా నీళ్లు వెళ్తుండడంతో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చొరవతో మన్యంకొండ దగ్గరలోని తుర్కోనికుంట చెరువుకు ఆ నీటిని మళ్లించారు. ఈ చెరువు నిండడంతో చెరువు కింద ఉన్న రైతులు 100ఎకరాల వరకు 4పంటలకు నీరు అందుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తుర్కోనికుంట చెరువు నిండడంతో కుంట కింద 100ఎకరాల రైతులు ఓబ్లాయిపల్లి, కోటకదిర ప్రజలు నిరంతరం నీటిని వాడుకోవచ్చని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటిని మంగళవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు ఆధ్వర్యంలో కుంటలోకి నీటిని విడుదల చేయించారు. ఇకపై ఈ నీటితో మన్యంకొండకు దగ్గరలో చెరువు కళకళలాడుతుందంటున్నారు. కొండపైకి మంచినీరు అవసరమైతే ఈ నీటిని వాడుకునే అవకాశం ఉందని, జాతరకు వచ్చే భక్తులకు నీటి కష్టాలు లేకుండా నిరంతరం చెరువు నిండా ఉంటుందన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...