ప్రతి సమస్యా పరిష్కరించాల్సిందే..


Wed,August 21, 2019 02:04 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ: ప్రజలకు ఎదురవుతున్న భూ సమస్యలతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించడంలో మండల అధికారులు మరింత శ్రద్ధ వహించాలని డీఆర్‌వో స్వర్ణలత అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ ద్వారా మండల రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. మా భరోసా కార్యక్రమం చేపట్టినప్పటి నుంచి ప్రతిరోజు ప్రజలు తమ సమస్యలను వివరించేందుకుగాను సంప్రదించడం జరుగుతుందన్నారు. అట్టి ఫిర్యాదులను మండలాల అధికారులకు నివేదించనున్నట్లు పేర్కొన్నారు. నిర్లక్ష్యం అనే మాటకు తావులేకుండా మండల అధికారులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఏ గ్రామం ఏమి సమస్య అనే వివరాలను మండలాలలోని గ్రామల వారీగా వీఆర్‌వోలకు ఇతర అధికారులకు అప్పగించి మండల అధికారులు రివ్యూ చేసుకుంటూ ప్రతి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పలుమార్లు చెబుతున్నా.. కొందరు మండల అధికారులు పనిలో పురోగతి కనిపించడంలేదన్నారు. కావాలని నిర్లక్ష్యంగా ఉంటే బాధ్యులపై సరైన సమయంలో చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఫిర్యాదును పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్వేల్యాండ్ రికార్డు జిల్లా అధికారి శ్యాంసుందర్‌రెడ్డి, అధికారులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...