అమ్మా.. బైలెల్లినాదో..


Wed,August 21, 2019 01:56 AM

జడ్చర్ల/మూసాపేట : బాదేపల్లి మున్సిపాలిటీతోపా టు, మూసాపేట మండలం జానంపేట, చక్రాపూ ర్, అచ్చాయిపల్లి గ్రామాల్లో మంగళవారం పోచమ్మ బోనాల ఉత్సవాన్ని భక్తి శ్రద్ధ్దలతో నిర్వహించారు. సున్నం, పసుపు, కుం కుమ, వేపాకులతో అలంకరించిన బో నాలతో మహిళలు సంప్రదాయబద్ధ్దంగా తమ గృహాల నుంచి అమ్మవారి ఆలయానికి చేరుకొని ప్రదక్షిణలు చేశారు. త మ కుటుంబ సభ్యులను, తమ గ్రామా న్ని చల్లంగా చూడాలని కోరుతూ పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం స మర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా, బో నాల ఉత్సవంలో పోతురాజుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. బాదేపల్లి మున్సిపాలిటీలో నిర్వహించిన బోనాల ఉత్సవంలో ఎ మ్మెల్యే లకా్ష్మరెడ్డి, రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూసాపేట మండలంలో సర్పంచులు కావలి శ్రీనివాసులు, శైలజారెడ్డి, చంద్రశేఖర్, ఎంపీటీసీ ఆంజనేయులు, పల్లవి తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...