మొక్కలు పెంచి కాలుష్యాన్ని నిర్మూలించండి


Tue,August 20, 2019 01:06 AM

-పీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పిండి పవన్‌కుమార్
పాలమూరు యూనివర్సిటీ: మొక్కలను పెంచి కాలుష్యాన్ని నిర్మూలించాలని పాలమూరు విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పిండి పవన్‌కుమార్ అన్నారు. సోమవారం పీయూలోని పీజీ కళాశాల ఆవరణలో ఇంటిగ్రెటెడ్ కెమిస్ట్రీ ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ -1 ఆధ్వర్యంలో హరితహారం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో హరితహారంపై ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. మొక్కలను పెంచడంతో ప్రజారోగ్యం పెంపొందుతుందన్నారు. కార్యక్రమంలో పీయూ ఓఎస్‌డీ డాక్టర్ మధుసూదన్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నూర్జాహన్, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ అనురాధరెడ్డి, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ ఓఎస్‌డీ రామ్మోహన్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ సిద్ధిరాములుగౌడ్, అధ్యాపకులు రవికుమార్, అయేషా హష్మీ మాలతి, ఉపేందర్, ఫిజికల్ డైరెక్టర్ బాల్‌రాజ్‌గౌడ్, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...