అధిక దిగుబడికి సేంద్రియ ఎరువులు


Tue,August 20, 2019 01:06 AM

హన్వాడ: రైతులు సేంద్రియ ఎరువులతోనే పంటలు సాగుచేస్తే అధిక దిగుబడి వస్తుందని ఏరువాక కేంద్రం శాస్త్రవేతలు అర్చన, శ్రీధర్ అన్నారు. ప్రొఫెసర్ జయ శంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు సోమవారం మండలంలోని బుద్దారంలో సాగు, పశుపోషణపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు వ్యవసాయ అధికారుల సూచనలతో పంటలు సాగు చేయాలన్నారు. ముందుగా భూములను భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. అధికారులు చెప్పిన పంట సాగుచేయడంతో ఎక్కువ దిగుబడి వస్తుందన్నారు. ఎక్కువగా ఎరువులు వాడరాదన్నారు.

ప్రస్తుతం గ్రామం చుట్టుపక్కల ఉన్న భూముల్లో అధికారులు చెప్పిన పంటలను మాత్రమే సాగు చేయాలని సూచించారు. మిగతా పంటలు వేస్తే దిగుబడి రాదన్నారు. నీటి సౌకర్యాలు లేకపోవడంతో మెట్టపంటలు ఎక్కువగా సాగుచేయడంతో పంటసాగు పట్ల రైతులు జాగ్రత్తలు పాటించాలన్నారు. సర్పంచు చెన్నయ్య, విద్యార్థులు అఖిల, నవ్య, అంజలి, పావని, మౌనిక పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...