జెండా పండుగ


Thu,August 15, 2019 01:49 AM

(వనపర్తి ప్రతినిధి/నమస్తే తెలంగాణ):పంద్రాగస్టు రోజు ఉదయాన్నే అమ్మ అందంగా ముస్తాబు చేసేది. ఆ సమయంలో ఆమెకు ఎంత సంతోషమో.. పిల్లల పండుగ అంటూ తొందరగా రెడీ చేసి పాఠశాలకు పంపేది. వారం రోజుల ముందు నుంచి మా పాఠశాలలో హడావుడి ఉండేది. నేను మా పాన్‌గల్ పాఠశాలకు కార్యదర్శిగా ఉన్నాను. ఏర్పాట్లన్నీ నేనే చూసేవాడిని. ప్రభాతభేరి ఘనంగా సాగేది. బ్యాండు చప్పుడు మధ్య వీధులగుండానిర్వహించిన శోభాయాత్ర మళ్లీ కండ్ల ముందు కదలాడుతున్నది. జాతి నేతలకు జైజైలు కొడుతుంటే.. ఊళ్లో వాళ్లందరూ ఇండ్లల్లోంచి బయటికి వచ్చి చూసేవాళ్లు. వరుస క్రమంలో వెళ్తున్న పిల్లలను చూసి సంబురపడేవాళ్లు.

అట్లా ఆ రోజంతా ఉత్సాహంగా సాగేది. మళ్లీ జెండా వందనం ఎప్పుడు వస్తదా అని ఎదురుచూసేవాళ్లం. అని గతంలోకి తొంగిచూశారు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి. మంత్రి హోదాలో వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ మైదానంలో జాతీయ జెండా ఎగురవేయడం ఎంతో సంతోషాన్నిస్తున్నదని పేర్కొన్నారు. జెండా ఎగురవేయడమంటే ప్రజల ఆకాంక్షలకు సంపూర్ణంగా పని చేయడానికి పునరంకితం కావడం. మట్టిమనుషుల ప్రయోజనాలే జాతి ప్రయోజనాలు అవి సంపూర్ణంగా నెరవేరిన నాడే త్యాగధనుల ఆకాంక్షకు సార్థకత అన్నారు.- మంత్రి నిరంజన్‌రెడ్డి

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...