విద్యుదా ఘాతంతో రైస్‌మిల్ ఆపరేటర్‌కు తీవ్రగాయాలు


Thu,August 15, 2019 01:42 AM

జువైనల్ జస్టిస్ బోర్డుకు ఇద్దరు మైనర్లు
గద్వాల క్రైం : గత నెల 30వ తేదీ అర్ధరాత్రి గద్వాలలోని ఎస్‌ఎల్‌ఎన్ మొబైల్ షాపులోకి వెళ్లి రూ.1.90 లక్షల విలువైన 17 సెల్‌ఫోన్‌లను తీసుకెళ్లిన ఇద్దరు మైనర్లను బుధవారం జువైనల్ జస్టిస్ బోర్డు (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్)కు తరలించినట్లు గద్వాల సీఐ జక్కుల హనుమంతు తెలిపారు. సంఘటనకు సంబంధించి గద్వాల టౌన్ పోలీసు స్టేషన్‌లో ఎస్సై సత్యనారాయణతో కలిసి సీఐ విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయిజ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన 16 ఏండ్ల వయసున్న ఇద్దరు బాలురు ఈ నెల 30వ తేదీ అర్ధరాత్రి దాటాక గద్వాల పాతబస్టాండ్‌లోని ఎస్‌ఎల్‌ఎన్ మొబైల్ షాపు షట్టర్‌ను ఎత్తి లోపలికి వెళ్లారు. షాపులోని 17 సెల్‌ఫోన్లను తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మరుసటి రోజు షాపు యజమాని శ్రీకాంత్ తన మొబైల్ షాపులో 17 సెల్‌ఫోన్లు లేని విషయాన్ని గుర్తించి గద్వాల టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. అయితే మంగళవారం గద్వాల శివారులో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఆ ఇద్దరు మైనర్లు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో వారిని పూర్తి స్థాయిలో పరిశీలించగా వారి వద్ద ఉన్న ఓ బ్యాగులో రూ.1.90 లక్ష విలువైన 17 సెల్‌ఫోన్లు లభించాయని సీఐ హనుమంతు తెలిపారు. ఈ ఇద్దరి బాలురను బుధవారం జువైనల్ జస్టిస్ బోర్డుకు పంపామని తెలిపారు. కాగా తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, ఏం చేస్తున్నారు? ఎక్కడుంటున్నారు? విలువైన వస్తువులు ఎక్కడి నుంచి వచ్చాయి? తదితర అంశాలను నిశితంగా పరిశీలించాలని సీఐ సూచించారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...