కుక్కల దాడిలో నెమలికి గాయాలు


Thu,August 15, 2019 01:41 AM

గట్టు : కుక్కల దాడితో నెమలికి గాయలైన సంఘటన మండలంలోని తారాపురం శివారులో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పొలాల్లో సంచరిస్తున్న నెమలిపై కుక్కలు దాడి చేశాయి. అయితే అక్కడే ఉన్న గ్రామ సేవకుడు దీన్ని గమనించి వెంటనే కుక్కల బారి నుంచి నెమలిని రక్షించి స్వాధీనం చేసుకున్నాడు. నెమలిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. ఎస్సై శ్రీనివాస్ వెంటనే పశువైద్యాధికారికి సమాచారం ఇచ్చి నెమలికి వైద్యం చేయించారు. అనంతరం నెమలిని అటవీశాఖ అధికారులకు అప్పగించామని ఎస్సై తెలిపారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...