పదేండ్ల బాలికపై లైంగికదాడి


Thu,August 15, 2019 01:41 AM

-ముగ్గురిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు
గద్వాల క్రైం : గద్వాల మండలం అనంతపురం గ్రామంలో ఐదోతరగతి బాలికపై అదే గ్రామానికి చెందిన బాలుడు (14) లైంగిక దాడికి పాల్పడ్డాడు. గద్వాల సీఐ జక్కుల హనుమంతు కథనం ప్రకారం.. బాధిత బాలిక తల్లి వ్యవసాయ కూలీ, తండ్రి ఆటో డ్రైవర్.. వీరిద్దరూ బుధవారం పనులకు వెళ్లడంతో ఇంటి దగ్గరే ఉన్న బాలికను, ఇంటి సమీపంలోనే ఉండే బాలుడు ఆడుకుందామని చెప్పి ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని సాయంత్రం వేళ ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు చెప్పి బోరున విలపించింది. ఆరు నెలల కింద కూడా ఈ బాలికపై గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు లైంగిక దాడికి పాల్పడ్డారు.

గ్రామ పెద్దల జోక్యంతో వ్యవహారం సద్దుమణిగింది. బాలిక తల్లిదండ్రులు బుధవారం తన కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన బాలుడితోపాటు ఆరు నెలల కిందట కూడా లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు మైనర్లపైనా గద్వాల రూరల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ముగ్గురు నిందితులపై లైంగికదాడి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ఆరోగ్య పరీక్షల నిమిత్తం బాలికను వైద్యశాలకు తరలించి... ఆ తర్వాత స్టేట్ హోమ్స్‌కు పంపుతామని గద్వాల సీఐ జక్కుల హనుమంతు నమస్తే తెలంగాణకు చెప్పారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...