చిక్సిత కోసం హైదరాబాద్‌కు తరలింపు


Thu,August 15, 2019 01:40 AM


కొల్లాపూర్,నమస్తేతెలంగాణ : రైస్ మిల్ యజమాని నిర్లక్ష్యానికి అందులో పని చేస్తున్న ఆపరేటర్ విద్యుదాఘాతానికి గురై తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం కొల్లాపూర్ మండలం సింగవట్నం గ్రామంలో చోటుచేసుకున్నది. బాధితుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. సింగవట్నం గ్రామానికి చెందిన సాయిబాబ శెట్టి గ్రామం వెలుపల వెంకటరమణ రైస్‌మిల్‌ను నెలకొల్పాడు. ఇందు లో ఆపరేటర్‌గా అదే గ్రా మానికి చెందిన కు రువ బాలయ్య (57) రెండేళ్లుగా పని చే స్తున్నాడు. అయితే బుధవారం మధ్యా హ్నం సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ నుంచి కరంట్ సరఫరాలో సాంకేతిక లోపం తలెత్తింది.

దీంతో రైస్‌మిల్ యజమాని సాయిబాబు విద్యుత్ ఉద్యోగులకు సమాచారం ఇవ్వకుండా ఆపరేటర్ కురువ బాలయ్యనే పురమాయించాడు. దీంతో బాలయ్య ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎక్కి ఫ్యూజ్‌వైర్‌ను సరి చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై కిందపడ్డాడు. దీంతో రెండు చేతులు, తొడ భాగాల్లో చర్మం కాలింది. 108 అంబులెన్స్‌లో చికిత్స కోసం కొల్లాపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. డాక్టర్ కిరణ్ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కుటుంబీకులు తెలిపారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...