జీపీఎఫ్ నిధులు స్వాహా


Thu,August 15, 2019 01:39 AM

-పోలీసులకు ఫిర్యాదు
నవాబ్‌పేట : తమకు తెలియకుండా తమ జీపీఎఫ్ నిధులను స్వాహా చేశారని ఇద్దరు ఉపాధ్యాయురాల్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి స్థానిక ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని కొండాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల టీచర్ మెరోలిన్‌కు రూ.2లక్షలు, హజిలాపూర్ ప్రాథమిక పాఠశాల టీచర్ నసీమ్‌భానుకు రూ.90వేలు 2016 సంవత్సరంలో జీపీఎఫ్ నిధులు మంజూరయ్యాయి. కాగా అప్పట్లో ఇట్టి నిధులు టీచర్లు డ్రా చేయలేదు. ఇటీవల నిధులు డ్రా చేసేందుకు జీపీఎఫ్ ఖాతాను టీచర్లు పరిశీలించగా రూ2లక్షల 90వేలు డ్రా చేసినట్లు తేలింది. అప్పటి ఎంఈఓ దశరథ్‌నాయక్ సంతకాలతో చెక్ రాయగా... అప్పటి ఎమ్మార్సీ కార్యాలయ అటెండర్ కిరణ్‌కుమార్ జిల్లాకేంద్రంలోని బ్యాంకులో డ్రా చేసినట్లు స్టేట్‌మెంట్‌లో తేలినట్లు వారి ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళా టీచర్లతో పాటు ఎంఈవో రాజునాయక్, మాజీ ఎంఈవో దశరథ్ నాయక్ ఎస్సై శివకుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. సమగ్రంగా విచారణ జరిపి ఫోర్జరీ సంతకాలతో నిధులు స్వాహా చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...