అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత


Thu,August 15, 2019 01:38 AM

నర్వ : స్థానికంగా కొనుగోలు చేసిన రాయచూర్‌లో విక్రయించేందుకు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన పాతర్చేడ్ గ్రామ శివారులో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని పాతర్చేడ్ గ్రామానికి చెందిన ఎరుకలి వెంకటేశ్, ఆత్మకూర్‌కు చెందిన పోశన్న, రవిలు వివిధ గ్రామాల్లో ప్రజలతో రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేశారు. పాతర్చేడ్ గ్రామానికి చెందిన రాముగౌడ్ పొలంలోని గుడిసెలో నిల్వ చేశారన్నారు. ఆ బియ్యాన్ని బుధవారం ఒక ఆటో (ఏపీ 22 టీఏ 5740)లో రాయచూర్‌లో అమ్మకానికి తీసుకెళ్తుండగా పాతర్చేడ్ శివారులో పట్టుకున్నామ న్నారు. అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గురురాజ్‌రావ్‌కు సమాచారం ఇవ్వగా వారు సంఘటనా స్థలానికి చేరుకొని ఆటోలో ఉన్న 15 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారన్నారు. బియ్యం తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ బుచ్చయ్య, రవిందర్‌గౌడ్, అశోక్ పాల్గొన్నారు.

ముడిగల మల్లయ్య తండాలో..
మరికల్ : ఆటోలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యా న్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన ధన్వాడ మండలంలోని ముడిగల మల్లయ్య తండా వద్ద బుధవారం చోటు చేసుకుంది. ధన్వాడ ఎస్సై శ్రీనివాసులు తెలిపిన సమాచారం మేరకు.. ముడిగల మల్లయ్య తండా నుంచి ఆటోలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారని కొందరు గ్రామస్తులు ధన్వాడ పోలీసులకు సమాచారం ఇచ్చారన్నారు. ఆ సమాచారం ఆధారంగా గ్రామానికి కొంత దూరంలో రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటోను పట్టుకున్నట్లు తెలిపారు. ఆటోలో మొత్తం 3.5 క్వింటాళ్ల బియ్యం ఉన్నాయని తెలిపారు. ఆటోను, బియ్యాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...