పాలమూరు పూర్తి చేయడమే లక్ష్యం


Wed,August 14, 2019 02:36 AM

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వరప్రదాయినిగా పేరుగాంచిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పరుగులు పెట్టించి, త్వరగా పూర్తి చేయాలని సీఎంకే సీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. హైదరాబాద్‌లో మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మహబూబ్‌నగర్ కొత్త చెరువు నుంచి మినీ ట్యాంక్ బండ్‌కు, ఉదండాపూర్ నుంచి మయూరి పార్కుకు నీళ్లు అందించాలని సూచించారు.

మహబూబ్‌నగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఉమ్మడి రాష్ట్రంలో ఏడారిగా మారిన పాలమూరు జిల్లా స్వరాష్ట్రంలో పచ్చబడుతున్నదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఇకపై కరువు నేలపైన కృష్ణమ్మ పరుగులు పెడుతుందని ఆయన పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఇరిగేషన్ అధికారులతో ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహబూబ్‌నగర్ నియోజకవర్గం పరిధిలో, మహబూబ్‌నగర్ జిల్లాకు నీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఉమ్మడి పాలమూరు కరువును శాశ్వతంగా పారదోలే విధంగా సీఎం కేసీఆర్ ప్రతిపాదనలు రూపొందించారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు మరింత వేగంగా పూర్తిచేసే అంశంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని ఆయన అన్నారు. అందులో భాగంగానే త్వరలో ఆయన పాలమూరు రానున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టు పనులను పరిశీలించడంతో పాటు సమీక్ష సైతం నిర్వహించనున్నారని శ్రీనివాస్‌గౌడ్ వివరించారు. మహబూబ్‌నగర్ కొత్త చెరువు నుంచి మినీట్యాంక్ బండ్‌కు, ఉదండాపూర్ నుంచి మయూరిపార్కుకు నీళ్లు అందించాలని అధికారులను ఆయన కోరారు. ప్రాజెక్టు పనుల వేగవంతంపై అధికారులు మరింత సమర్థంగా పనిచేయాలని ఆయన కోరారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి జరుగుతున్న పనులు, రిజర్వాయర్లు, లిఫ్టుల వివరాలు, మ్యాపులు ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులు మంత్రికి వివరించారు. ఈ సమీక్షలో మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, సీఈ రమేష్, ఈఈలు దయానంద్, రాజశేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...