కులమతాలకతీతంగా గణేశ్ పండుగ


Tue,August 13, 2019 12:43 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ: గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేశ్ పండుగ ఉత్సవాలను అద్భుతంగా కులమతాలకతీతంగా నిర్వహించుకుదామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవ సమితి సమావేశానికి మంత్రి, ఎంపీ, హాజరై మాట్లాడారు. గణేశ్ ఉత్సవాలు అనగానే యువతలో ఉప్పొంగే ఉత్సహాం వస్తుందన్నారు. అందరు సంమయానం పాటిస్తు నియమనిబంధనలను పాటిస్తు గణేశ్ పండగాను జరుపుకోవాల్సిన అవశ్యకత ఉందన్నారు. గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు గణేశ్ పండుగ ప్రక్రియను పూర్తిగా అధ్యయనం చేసి అడుగులు వేయాలని సూచించారు.

శాంతియుతవాతావరణంలో గణేశ్ పండగ జరుగాలని, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా ఏర్పాట్లు సమష్టిగా చర్యలు తీసుకుందామని తెలియజేశారు. ఎలాంటి సహాయ సహకారాలు కావాల్సి ఉన్న అందుబాటులో ఉండి సేవ చేయడం జరుగుతుందన్నారు. నిర్లక్ష్యం అనే మాటకు తావు లేకుండా గణేశ్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుందామని పిలుపునిచ్చారు. గణేశ్ విగ్రహాలను ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్కరు తమ పేర్లను నమోదు చేసుకొని శాంతియుతంగా ముందుకు సాగేందుకు సహకరించాలన్నారు. అనంతరం మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డిని శాలువా పూలమాలతో గణేశ్ ఉత్సవ కమిటీ నేతలు ఘనంగా సత్కరించారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...