మన్యంకొండలో విష్ణు సహస్రనామ పారాయణం


Tue,August 13, 2019 12:42 AM

మహబూబ్‌నగర్ తెలంగాణ చౌరస్తా: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం మన్యంకొండలో సోమవారం విష్ణు సహస్ర నామ పారాయణం 24 గంటల పాటు నిరంతరంగా పాడారు. గొండ్యాల గ్రామస్తులు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో 24 గంటల పాటు విష్ణు సహస్ర నామ పారాయణంతో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

అందులో భాగంగా ఈ సంవత్సరం ఆదివారం నుంచి సోమవారం వరకు విష్ణు సహస్ర నామం చదివి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని కోరారు. పారాయణం చేసిన భక్తులకు ఆలయ ధర్మకర్త అళహరి మధుసూధన్‌కుమార్ వారికి కండువాలతో సన్మానించారు. విష్ణు సహస్ర నామా పారాయణం ద్వారా వేంకటేశ్వర స్వామి ప్రశాంతంగా ఉంటారని లోక కల్యాణార్థం ఈ పారాయణం చేసినా, విన్న వారందరూ సుఖ సంతోషాలతో ఉంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ వెంకటాచారి, ఆలయ అర్చకులు గొండ్యాల గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...