దశాబ్దం కిందటి పరిస్థితులు వచ్చినా..


Tue,August 13, 2019 12:41 AM

కృష్ణా, తుంగభద్ర నదులకు వస్తున్న వరద 2009 అక్టోబర్‌లో వచ్చిన వరదను గుర్తుకు తెస్తున్నది. అప్పట్లో తుంగభద్రలో సుమారు 7 లక్షల క్యూసెక్కులకు పైగా వరద కొనసాగింది. దాని ప్రభావం వల్ల ఏపీలోని మంత్రాలయం, కర్నూలు పట్టణాలు సహా గద్వాల డివిజన్ పరిధిలోని అనేక గ్రామాలు నీట మునిగాయి. ప్రజలు నిరాశ్రయులయ్యారు. రాయచూరు నుంచి మంత్రాయలం వెళ్లే మాధవరం బ్రిడ్జి, తెలంగాణ ఏపీని కలిపే అయిజ మండలం పులికల్ బ్రిడ్జి నదిలో కొట్టుకుపోయాయి. 3 రాష్ర్టాల మధ్య రాకపోకలు నిలిచి పోయాయి. ఇక కృష్ణానదికి వచ్చిన సుమారు 12 లక్షల వరద వల్ల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అనేక గ్రామాలు తల్లడిల్లాయి. ఈ నేపథ్యంలో కృష్ణా, తుంగభద్ర నదులు భీకరంగా ప్రవహిస్తుండటంతో అధికార యంత్రాంగం అప్రమ త్తమైంది. అయితే తుంగభద్రకు సుమారు 2 లక్షలు, కృష్ణానదికి నిలకడగా 8 లక్షల వరద వస్తున్నది. రెండు నదుల నుంచి వస్తున్న వరదను కలిపినా 10 లక్షల క్యూసెక్కులుగా ఉండ నుంది. అంతకు మించి వరద వచ్చినా ఇబ్బందులేమీ ఉండవని నిపుణులు అంటున్నారు. 2009లో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సుమారు 26 లక్షల క్యూసెక్కుల అవుట్ ఫ్లో నమోదైందని... కాబట్టి భయపడేంత పరిస్థితి ఉండబోదంటున్నారు.

తొలగిన ఇబ్బందులు
ఆదివారం నాడు ఉగ్రరూపంతో ప్రవహించిన కృష్ణమ్మ సోమవారం నాడు కాస్త శాంతించింది. భీమా, కృష్ణా నది సంగమమైన తర్వాత నారాయణపేట జిల్లాలోని వాసు నగర్‌లో, హిందూపూర్ గ్రామాలు ఆదివారం వరద భారిన పడ్డాయి. ఇక్కడి వారిని కున్సి సమీపంలో పునరావాస కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం వరద క్రమంగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో పరిస్థితి అదుపులోకి వస్తున్నది.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...