నదీ తీరప్రాంతాల్లో అధికారుల హెచ్చరికలు


Tue,August 13, 2019 12:41 AM

మానవపాడు/ఉండవెల్లి : కృష్ణా, తుంగభద్ర నదీతీర గ్రామాల్లో అధికారులు ముందస్తుగా హె చ్చరికలు జారీ చేశారు. రెండు నదుల్లో వరద తీ వ్రత ఎక్కువగా ఉన్నందున నదీ తీర ప్రాంతాల్లో ని గ్రామాల ప్రజలు నదిలోకి వెళ్లకూడదని మానవపాడు మండలంలోని మద్దూరు, కొర్విపాడు, ప ల్లెపాడు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమ త్తం చేశారు. వీఆర్వో, వీఆర్‌ఏలను గ్రామాల్లోనే ఉన్నారు. ప్రజలు ఎవరూ నదిలోకి, చేపల వేటకు వెళ్లవద్దని గ్రామంలో దండోరా వేయించారు. ఉండవెల్లి మండలంలోని పుల్లూరు, మెన్నిపాడు, క ల్లుగోట్ల గ్రామాల మీదుగా తుంగభద్ర నది భారీగా ప్రవహిస్తున్నది.

దీంతో తాసిల్దార్ నరేందర్, ఎంపీడీవో ఆంజనేయరెడ్డి, ఎస్‌ఐ విజయ్‌కుమార్ గ్రామాలను సందర్శించి నదిలో వరద ప్రవాహాన్ని ఆయా గ్రామాల ప్రజలు నదీ ప్రవాహాన్ని బట్టి అవసరమైతే సురక్షిత ప్రాంతాల కు తరలివెళ్లాలన్నారు. నిరంతరం పోలీసులు, రెవె న్యూ అధికారులు పనిచేస్తున్నట్లు వివరించారు. కాగా, ఆయా గ్రామాల్లో ఆర్డీవో రాములు పర్యటించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులు, గజ ఈతగాళ్లు, రిస్క్ సిబ్బంది ఉన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...