త్యాగానికి ప్రతీక బక్రీద్


Mon,August 12, 2019 02:25 AM

-నేడు బక్రీద్ పండుగ
-ముస్తాబైన ఈద్గాలు, మసీదులు
వనపర్తి, నమస్తే తెలంగాణ / గద్వాల టౌన్ : బక్రీద్ పండుగ రోజున ముస్లిం లు సామూహిక నమాజ్ చేస్తారు. మసీదులలో, ఈద్గాల వద్ద ఖురాన్‌ను చదువుతారు. ప్రార్థనలనంతరం ఒకరిని ఒకరు కలుసుకుని శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ప్రార్థనలు ముగిశాక, పొట్టె ళ్లు, ఒంటెలు ఇలా ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు వారి వారి స్థోమతను బట్టి బలి ఇస్తారు. ఇలా ఇచ్చిన బలిని పేదలకు సగం దానం చేసి మరో సగం వారు ఉం చుకుంటారు.

బక్రీదు అంటే..
సృష్టి ఏర్పాటు చేసిన తరువాత హజ్రత్ అదమ్ అలైహివసలాం నుంచి మహమ్మద్ ప్రవక్త సల్లెల్లాహు అలైవసల్లం(చివరి ప్రవక్త)వరకు ఎందరో ప్రవక్తలను భూమ్మీదకు పంపారు. అందులో ఒకరు హజ్రత్ ఇబ్రహీం అలైవసలాం. ఈయనకు దైవ భక్తి ఎక్కువ. ఇబ్రహీం భక్తిని తెలుసు కునేందుకు అల్లాహ్ అనేక పరీక్షలు పెట్టాడు. పరీక్షల్లో భాగంగా ఇబ్ర హీం కొడుకైన హజ్రత్ ఇస్మాయిల్‌ను త న పేరిట త్యాగం చేయాలని అల్లాహ్ ఇబ్రహీంకు సూచిస్తాడు. దీంతో అల్లా హ్ ఆదేశాన్ని అమలు చేసేందుకు ఇబ్ర హీం ఇస్మాయిల్ అలైవసలాంను బలి ఇ చ్చేందుకు సిద్ధపడతాడు. ఓ రాయి మీ ద ఇస్మాయిల్‌ను పడుకోబెట్టి కత్తి తో మె డను నరికేందుకు కత్తిని పేకి తీస్తా డు. అంతలోనే ఇస్మాయిల్ మాయమై ఇస్మాయిల్ స్థానంలో గొర్రె ఉంటుంది. ఎత్తిన కత్తి గొర్రె మెడ మీద పడి రెండుగా వేరవుతుంది. తన కొడుకును సై తం అల్లాహ్‌కు త్యాగం చేసేందుకు వెనుకాడకుం డా తన భక్తిని చాటుకున్నాడు ఇబ్రహీం. అందుకు ప్రతీకగానే బక్రీద్‌ను ము స్లింలు జరుపుకుంటారన్నది కథనం ప్రాచుర్యంలో ఉంది.

ఖుర్భాని తప్పనిసరి..
బక్రీదు నాడు ప్రతి ముస్లిం తనకు ఉ న్నంతలో ఇతరులకు దానం చేస్తారు. బక్రీదు పండుగ నాడు ఇబ్రహీం అలైవసలాం త్యాగాన్ని స్మరించుకుంటూ ఖుర్భానీ చేయడం ద్వారా సకల సంపదలు కలిగి అల్లాహ్ చల్లంగా చూ స్తాడని నమ్మకం. మేక, గొర్రె ఖుర్బాన్ని ఇచ్చే వ్యక్తి ఒక పేరిట ఒక జంతువును ఖుర్బాన్ని ఇవ్వాలి. గొర్రె,మేక, ఎద్దు, ఒంటే వీటిలో ఏదైన జంతువును ఏడు భాగాలు చేస్తారు. అందులో మరో మూడు భాగాలు చేస్తారు. అందులో ఒకటో వంతు పేదలకు రెండో భాగాన్ని బంధు మి త్రులకు పంచుతారు. మూ డో వంతును ఖుర్భానీ ఇచ్చిన వారు తిం టారు. మూడ్రోజుల్లోపు వారి వారి వీలు ను బట్టి ఎప్పుడైనా ఖుర్భానీ చేయవ చ్చన్నది ముస్లింల నమ్మకం.

ముస్తాబైన ఈద్గాలు...
బక్రీదు పండుగ పురస్కరించుకుని జిల్లాలోని ఈద్గాలు, మసీదులు ముస్తా బయ్యాయి. ముస్లీంలు ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంది.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...