గుట్కా ప్యాకెట్ల పట్టివేత


Mon,August 12, 2019 02:22 AM

కేటీదొడ్డి: రూ.1.70లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు పట్టుకున్న సంఘటన మండలంలోని పోలీస్‌స్టేషన్ ముందు ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై బాలవెంకటరమణ తెలిపిన వివరాల మేరకు.. ఓ వాహనంలో సమీర్, గొల్లరామకృష్ణ అనే వ్యక్తులు 64వేల గుట్కా ప్యాకెట్లు కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ రా ష్ట్రంలోని కర్నూల్ జిల్లాకు తరలిస్తుండగా రాయచూర్-గద్వాల రహ దారిపై పోలీస్‌స్టేషన్ ముందు వాహనాలు తనిఖీచేస్తున్న తరుణంలో భారీఎత్తున గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భం గా వారిపై కేసునమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...