తెలుగులో ఇంగ్లిష్ మందులు


Mon,August 12, 2019 02:21 AM

కల్వకుర్తి రూరల్: వ్యాదులకు వైద్యులు రాసే ప్రతి మం దు కూడా ఇంగ్లిష్‌లో అయోమయంగా ఉంటుంది. గతంలో ప్రభుత్వ దవాఖానాలతో పాటు ప్రైవేట్ దవాఖానాలలోని వైద్యులు మందుల పేరు తెలుగులో చూద్దామని కనిపించేదికాదు. చివరకు వైద్యులు వ్యాధి పేరు లక్షణాలు కూడా అన్ని ఇంగ్లిష్‌లో ఉండడంతో ప్రజలంతా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. కనీసం మందులపేర్లు పలకడం, వ్యాధి పేర్లు చెప్ప డం చాలా తికమక పడే పడే పరిస్థితి, అయోమయంగా ఉం డేది. చదువుకున్న వారు సైతం మందుల పేర్లను పలకడం చాలా కష్టంగా ఉండేది. వైద్యులు రాసే మందుల చీటీలో రాతలు కూడా ఏమాత్రం అర్థమయ్యే పరిస్థితి ఉండేదికాదు. వైద్యులు రాసే రాతలు మందుల దుకాణం యజమానులకు మాత్రం తప్ప బయటి వారెవ్వరికీ అర్థం కాక చికాకుపడాల్సిన పరిస్థితి ఉండేది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ తెలుగు భాషను మరింత పటిష్టం చేసే దిశగా వైద్యారోగ్య శాఖలో మందులపై గతంలో మాదిరిగా కాకుండా ఇంగ్లిష్‌లో కాకుండా తెలుగులో వాటిని ము ద్రితం చేసి సామాన్యులకు అందుబాటులోకి తీసుకోస్తున్నా రు. ఎక్కువ మొత్తంలో వినియోగంలో ఉండే మందులపై ఇంగ్లిష్‌తో పాటుగా తెలుగులో ముద్రించి నూతన ఒరవడిని సృష్టిస్తున్నారు వైద్యారోగ్య శాఖ అధికారులు.
తెలుగు భాషకు పునరుజ్జీవం..
రోజుకురోజకు తెలుగు భాష ప్రాధాన్యత తగ్గిపోతున్న త రుణంలో తెలుగు భాషకు పునర్‌వైభవం తెచ్చేందుకు సీఎం కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. తెలుగు భాషను అభివృద్ధి చేసేందుకు నిర్ణయాలు తీసుకున్న గతం లో ఏ ప్రభుత్వం అందుకు అనుగుణంగా కార్యాచరణకు సిద్ధ పడలేదు. తెలుగు భాషను కాపాడంతో పాటుపునరుజ్జీవం అందించేందుకు గాను ప్రత్యేకంగా వసతులు, నిధులు, సమ్మేళనాలు, ప్రత్యేకంగా కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు వాటి నిర్వాహణకు కావాల్సిన నిధులను కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్‌కు టీర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది. అంతేగాకుండా పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో తెలుగు పాఠ్యంశాలను ఖచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిబంధన జారీ చేయడంతో పాఠశాలలో 1,2 వ తరగతి నుంచి తెలుగును ప్రతి తరగతిలోఅమలు చేస్తున్నారు. వైద్యారోగ్య శాఖలో గతంలో ఎప్పుడూ లేని విధంగా మందులపైన ఇంగ్లిష్, తెలుగులో ముద్రించేందుకు సన్నాహాలు చేశారు.
మందులపైన తెలుగు పేర్లు..
ప్రభుత్వ దవాఖానాలలో అందించే మందుల పేర్లు దా దాపు తెలుగులో ఉంటున్నాయి. రోగులు వైద్యులను సంప్రదించిన అనంతరం చీటీ ద్వారా పొందే ప్రతి మందులపై తెలుగులో ముద్రించి ఉండడంపై పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా మందులపైన తెలుగులో ము ద్రించి ఉండడంతో ఏఏ వ్యాధికి ఏఏ మందును వైద్యులు రాసారో ఎంత పరిమాణంలో, ఎన్ని సార్లు వాడాలో సులభంగా అర్థం చేసుకునే వీలుందని చాలా మంది రోగులు చెబుతున్నారు. ఆల్బెండజోల్, అమాక్సిలిన్, పారాసిటమాల్, ప్రమిసెటిన్, పాంటా ప్రజోల్, వెట్రునిడజోల్, అటెన్‌లాల్, ఇలా బీపీ, షుగర్, చిన్నపిల్లల, సాధారణ వ్యాధులకు ప్రతి మందుల పేర్లు ఇంగ్లిష్‌తో పాటు తెలుగులో ముద్రించడంపై విద్యావంతులు ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రభుత్వాలు చేయలేని విధంగా టీఆర్‌ఎస్ సర్కారు చేయడం చాలా గొప్పదని అంటున్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...