పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం


Mon,August 12, 2019 02:20 AM

హన్వాడ: రాష్ట్రలో ఎక్కడైన పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యమందిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మండలంలోని ఇబ్రహీంబాద్‌కు చెందిన గోవింద్‌రెడ్డికి సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 2లక్షల 50వేల చెక్కును ఆదివారం జిల్లా కేంద్రంలో మంత్రి చేదుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో దాదాపుగా ఇప్పుటి వరకు 1500మందికి సీఎం సహాయ నిధి నుంచి చెక్కులు అందిచినట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి పార్టీలకతీతంగా కలసిరావాలని సూచించారు. ఎవరైన నా దగ్గరకు వచ్చిన వారికి నిరంతరం సేవ చేస్తాన్నారు. మాజీ సర్పంచు కృష్ణారెడ్డి, శ్రీనివాసులు, నారంరెడ్డి, వెంకట్‌రెడ్డి, యాదయ్య తదితరులు ఉన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...