అందరి సంక్షేమమే ధ్యేయం


Sun,August 11, 2019 02:29 AM

-రాష్ట్రంలో ఐదేండ్లలో 70 ఏండ్ల అభివృద్ధి
-స్లాటర్ హౌజ్‌తో ఆరెకటికలకు తీరనున్న కష్టాలు
-రోజురోజుకూ పెరుగుతున్న మాంసం విక్రయాలు
-ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని కో యిలకొండ క్రాస్‌రోడ్డు సమీపంలో రూ.6.50 కోట్లతో నిర్మించనున్న మాడ్రన్ స్లాటర్ హౌస్ నిర్మాణానికి పూ జలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 70 ఏండ్ల చరిత్రలో వధశాల కోసం ఎంతో మంది నాయకుల దగ్గర ఆరెకటికలు మొ రపెట్టుకున్నా వారికి నిరాశే మిగిలిందన్నారు. స్లాటర్ హౌస్ లేక అవస్థలు పడుతున్న ఆరెకటికలు తమ సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే పట్టణానికి అతి సమీపంలో తాండూర్ రహదారి పక్కన రెండు ఎకరాల స్థలం కేటాయించినట్లు పేర్కొన్నారు. స్థలంతోపా టు నిర్మాణానికి అవసరమైన రూ.6.50 కోట్లను మం జూరు చేయించి వారి అభివృద్ధి కోసం కట్టుబడి పని చే స్తున్నామన్నారు. స్లాటర్ హౌస్ నిర్మా ణం ప్రాంగణంలో నే మిషన్ భగీరథ నీటి సరఫరా పాయింట్ ఉండడంతో మంచినీటితో శుభ్రపర్చి ఇవ్వడానికి వీలు కలుగుతుందన్నారు.

రోజురోజుకు మాంసం వినియోగం పెరుగుతుండడంతో డ్రస్సింగ్ చేయడంలో ఇబ్బందులు కలుగుతున్నాయని, ఈ నేపథ్యంలో ఆధునిక యంత్రాలతో కూడిన స్లాటర్ హూస్‌ను నిర్మిస్తున్న ట్లు తెలిపారు. అనంతరం ఆరెకటిక సంఘం నాయకు డు జమాల్‌పూర్ రమే శ్ మాట్లాడుతూ గతంలో స్లాటర్ హౌస్ నిర్మాణం కోసం ఎంతో మంది నాయకులను కలిశామని, ఎవరూ తమ గోడు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని స్లాటర్ హౌస్‌ని ర్మాణం కోసం స్థలాన్ని కేటాయించడంతోపాటు అవసరమైన నిధులను మంజూరు చేయ డం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు షౌకత్ అలీ, ఆరెకటిక సం ఘం నాయకులు పాల్గొన్నారు.

మంత్రికి రక్షాబంధన్
మహబూబ్‌నగర్, తెలంగాణ చౌరస్తా : ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఉమ్మడి జిల్లా ఇన్‌చా ర్జి బీకే మహాదేవి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీకే సమత, ఈశ్వరీయ వి ద్యాలయం సభ్యులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాలకు పరామర్శ
హన్వాడ : మండల కేంద్రానికి చెందిన టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కొండా లక్ష్మయ్య తండ్రి చంద్రయ్య శనివారం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయా న్ని తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. చంద్రయ్య పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అ లాగే, ఇటీవల మాతృవియోగం పొందిన హన్వాడ ఉప సర్పంచ్ గంగాపూరిని మంత్రి పరామర్శించారు. ఆయ న వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, సింగిల్‌విండో చైర్మన్ కోరమోని వెంకటయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు తదితరులు ఉన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...