రాహుల్ నోయల్‌కు బెస్ట్ స్పీకర్ ఆవార్డు


Sun,August 11, 2019 02:26 AM

మరికల్ : మండల కేంద్రానికి చెందిన విద్యా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రాహుల్ నోయల్ బెస్ట్ స్పీకర్ అవార్డు అందుకున్నారు. రెండు రోజులుగా న్యూఢిల్లీలో జరుగుతున్న 14వ ప్రపంచ విద్యా శిఖరాగ్ర సమావేశల్లో పాల్గొన్నారు. విద్యార్థులకు నూతన ఒరవడిపై నిర్వహించిన చర్చావేదికలో పాల్గొనడంతో శనివారం యూకేకు చెందిన మేనేర్వా యూనివర్సిటీ మేనేజింగ్ డైరెక్టర్ బేన్ టక్కర్ బెస్ట్ స్పీకర్ అవార్డు అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్‌కు ఆవార్డు రావడంపై కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...