శ్రీశైల క్షేత్రం.. భక్తజన సంద్రం


Sun,August 11, 2019 02:26 AM

మహబూబ్‌నగర్ క్రైం : శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత కోసమే పోలీస్ శాఖ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుందని జిల్లా అదనపు ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు అన్నారు. 2వ పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నూర్ కాలనీలో శనివారం సాయంత్రం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కాలనీలోని 150 నివాసగృహాల్లో ఉంటున్న ప్రజలను విచారించి సరైన ధ్రువ పత్రాలు లేని 3 ఆటోలు, 22 బైకులు, ఒక ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ సమాజంలో అల్లరి మూకలను అణిచి వేసేందుకు పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యలను నిర్భయంగా పోలీసులకు చెప్పాలని, సంఘ వ్యతిరేక శక్తులను కట్టడి చేసే బాధ్యత తమదని ఆయన భరోసా ఇచ్చారు. కార్డన్ సెర్చ్‌లో డీఎస్పీ భాస్కర్, టూటౌన్ సీఐ శ్రీనివాసాచారితోపాటు 90 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...