జోగుళాంబ సన్నిధిలో ద్వారకా తిరుమల ఆలయ ఈవో


Sun,August 11, 2019 02:26 AM

అలంపూర్, నమస్తే తెలంగాణ : పట్టణంలోని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను శనివారం ద్వారకా తిరుమల దేవస్థానం కార్యనిర్వహణ అధికారి పెద్దిరాజు సతీసమేతంగా దర్శించుకున్నారు. అంతకుముందు వారికి ఆలయ ఈవో ప్రేమ్‌కుమార్ అర్చకులతో కలిసి స్వాగతం పలికారు. స్వామి, అమ్మవారి ఆలయంలో వారు ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం వారిని ఆలయ ఈవో శేషవస్త్రంతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం పలికారు. శనివారం సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలను దర్శించుకున్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...