భక్తులకు ఉచిత అన్నదానం


Sun,August 11, 2019 02:25 AM

లక్ష్మీవేంకటేశ్వర స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు ప్రతి శనివారంతోపాటు నిత్యాన్నదానం కొండపై కోనేరు సమీపంలోని అన్నదాన క్షేత్రంలో నిర్వహించడం జరుగుతుందని ఆలయ ధర్మకర్త అళహరి మధుసూదన్‌కుమార్ తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా స్వామివారిని దర్శించుకున్న తర్వాత అన్నప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఉచిత అన్నదాన కార్యక్రమం 13ఏండ్లుగా నిరంతరం కొనసాగుతుందన్నారు. మన్యంకొండ స్వామి కృపా కటాక్షంతో ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ సిబ్బంది భక్తులకు సేవ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

శ్రావణ మాసంలో ప్రతిరోజు స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించడంజరుగుతుందని పేర్కొన్నారు. సేవా కార్యక్రమాల్లో ఆలయ ప్రధాన అర్చకులు ఏవో వెంకటాచారి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...