మార్మోగిన గోవింద నామస్మరణ


Sun,August 11, 2019 02:25 AM

మహబూబ్‌నగర్ తెలంగాణ చౌరస్తా: గోవింద నామ స్మరణతో మన్యంకొండ భక్తులతో మార్మోగింది. శ్రావణ మాసం రెండో శనివారం కావడంతో జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి భక్తులు లక్ష్మీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. ముందుగా కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం స్వామివారి దర్శనానికి కోనేరు నుంచి గర్భగుడి వరకు భక్తులు బారులు తీరి విడది చేశారు. అదేవిధంగా స్వామివారికి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. శ్రావణంలో వ్రతాలు చేస్తే తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉంటాయని భక్తులు నమ్ముతారు.

ఏటా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తామని మొక్కుకున్న వారు తప్పకుండా స్వామివారికి సత్యనారాయణ వ్రతం నియమ నిష్టలతో చేస్తారని, వేద పండితులు చెబుతున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతం ఇంటి వద్ద చేయలేని భక్తులు దేవాలయాల్లో చేసినా పుణ్యం దుక్కుతుందని భక్తుల నమ్మకం. దీంతో సత్యనారాయణ స్వామి వ్రతాలతో దేవాలయ ప్రాంగణం భక్తిభావంతో నిండిపోయింది.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...