విలువలతో కూడిన విద్య అవసరం


Sun,August 11, 2019 02:25 AM

-జెపీఎన్‌సీఈలో ఐదో గ్రాడ్యుయేషన్ డే
మహబూబ్‌నగర్ నమస్తే తెలంగాణ : యువ గ్రాడ్యుయేట్లకు విలువలతో కూడిన విద్య అవసరమని తెలంగాణ అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లాఅండ్‌ఆర్డర్) డాక్టర్ జితేందర్ గోయల్ అన్నారు. పాలమూరులోని జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ఐదో గ్రాడ్యుయేషన్‌కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు క్రమశిక్షణ, నిబద్ధత, విధేయత, సమయకాలం అలవర్చుకొనుట ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించగలరని తెలిపారు. ప్రతి విద్యార్థి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటే వృత్తిలో రాణించగలరని అన్నారు. తాను హైదరాబాద్ ట్రాఫిక్ కమిషనర్‌గా ఉన్నప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్‌గా అపరాధ రుసుమును ఆన్‌లైన్ ద్వారా చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టామని తెలియజేశారు. కార్యక్రమంలో రామకృష్ణ మిషన్ తరపున శ్రీనివాస్, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పుల్లయ్య, కళాశాల కార్యదర్శి వెంకట్రామారావు, ప్రిన్సిపాల్ సందీప్, వివిధ విభాగాధిపతులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...