పక్కా ప్రణాళికలతో కూడళ్ల అభివృద్ధి


Sat,August 10, 2019 02:36 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ: పట్టణ అభివృద్ధిలో ప్రధాన భూమిక పాత్ర పోషిస్తున్న ప్రధాన కూడళ్ల విస్తరణతోపాటు అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అధికారులు అడుగులు వేయాలని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ ముందు రోడ్డు విస్తరణ స్థలం, న్యూటౌన్, మెట్టుగడ్డ చౌరస్తాలను కలెక్టర్ ప్రత్యేకంగా పరిశీలించారు. రోడ్డు ఇరువైపులా విస్తరణ కంటే చౌరస్తాలో మరింత అధికంగా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటూ ముందుకుసాగాలని తెలిపారు. పట్టణ కేంద్రానికీ కూడళ్లు చాలా ముఖ్యమైనవని, ఈ కూడళ్ల విస్తరణతోపాటు అభివృద్ధి పక్కాగా చేయాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని పనుల్లో నిర్లక్ష్యం అనే మాటకు తావు లేకుండా పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...