ఆత్మైస్థెర్యాన్ని నింపేందుకే వాయిస్ ఫర్ గల్స్


Sat,August 10, 2019 02:35 AM

స్టేషన్ మహబూబ్‌నగర్: బాలికల్లో భయం పారద్రోలి ఆత్మైస్థెర్యాన్ని నింపడానికి వాయిస్ ఫర్ గల్స్ శిక్షణ ఎంతో ఉపయోగ పడుతుంది కలెక్టర్ రొనాల్డ్ రోస్ అన్నారు. వాయిస్ ఫర్ గల్స్ ఎన్‌జీవో ఆధ్వర్యంలో కేజీబీవీ విద్యాలయాల్లో శిక్షణ పొందిన విద్యార్థులతో శుక్రవారం మయూరీ పార్కులో ఆత్మీసమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌తోపాటు డీఈవో నాంపల్లి రాజేశ్ హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ మాట్లాడుతూ.. శిక్షణ ద్యారా నేర్చుకున్నవి నిజజీవితంలో ఉపయోగించాలని సూచించారు. సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. కౌమారదశలో ఉన్న అమ్మాయిల ఆరోగ్యం, హక్కులు, భవిష్యత్తు ప్రణాళిక గురించి శిక్షణలో అవగాహన కల్పించామని తెలిపారు. శిక్షణ ద్యారా వారు జీవితంలో నిర్ణయించుకున్న లక్ష్యం ఏంటి.. ఆ లక్ష్యాన్ని ఏ విధంగా చేరుకోవాలనే అంశాలు సమ్మేళంలో చర్చించారు. సెక్టోరియల్ అధికారి అస్సాఖాద్రీ, వాయిస్ ఫర్ గల్స్ ప్రతినిధులు మల్లిక, మౌనిక, పల్లవి, భాగ్య, ధరణి, నిధి, అఖిల, ప్రియాంక పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...