పీయూలో ప్రపంచ ఆదివాసుల అంతర్జాతీయ దినోత్సవం


Sat,August 10, 2019 02:35 AM

పాలమూరు యూనివర్సిటీ: ప్రపంచంలో ఆదివాసుల భాషను, సంస్కృతిని, కాలక్రమేణా కనుమరుగయిపోతున్నాయని, వాటిని పరిశోధనల ద్వారా వెలికి తీయాలని పీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పిండి పవన్‌కుమార్ అన్నారు. శుక్రవారం పాలమూరు విశ్వ విద్యాలయంలోని ఆంగ్ల విభాగం ఇన్‌చార్జి డాక్టర్ మనోజ ఆధ్వర్యంలో ఆర్ట్స్ హ్యూమనిటీస్ సోషల్ సైన్స్ విభాగాల చొరవతో ప్రపంచ ఆదివాసుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ఐక్యరాజ్య సమితి 2019న మూలవాసులు, ఆదివాసుల సాంస్కృతీ, సాంప్రదాయాలను అంతర్జాతీయ స్థాయిలో వేదికలపై చర్చించాలని సూచించిందన్నారు. ప్రపంచ దేశాలలో గొండిలిటి తయారీ విషయంలో ఆంగ్ల భాషాధిపతి, ఆచార్య గూడూరు మనోజ కృషి ఎంతో ఉందని అభినందించారు.

పరీక్షల విభాగం ఇన్‌చార్జి డా.నాగం కుమారస్వామి మాట్లాడుతూ.. ప్రపంచ జనాభాలో 5% మూలవాసుల భాషా సంస్కృతి, ఆచార వ్యవహారాలను, వాళ్ల ఆహార అలవాట్లను వైవిద్యమన్నారు. కార్యక్రమంలో పీయూ ప్రొఫెసర్ గిరిజ మంగతాయారు, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డా.నూర్జాహాన్, అధ్యాపకులు డా.శ్రీనాథచారి, డా.భూమయ్య, అర్జున్‌కుమార్, చంద్రకిరణ్, మాళవిక,శాంతిప్రియ, గాలెన్న, ఫ్యాకల్టీ సభ్యులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...