రాష్ట్రస్థాయి టోర్నీలో విజేతగా నిలవాలి


Sat,August 10, 2019 02:35 AM

మహబూబ్‌నగర్ స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ టోర్నీలో జిల్లా జట్టు విజేతగా నిలువాలని జిల్లా ఫుట్‌బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి గజానంద్ అన్నారు. మంచిర్యాల జిల్లాలో నేటి నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి బాలికల ఫుట్‌బాల్ టోర్నీలో పాల్గొనే జిల్లా జట్టు తరలివెళ్లింది. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఫుట్‌బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి గజానంద్ జిల్లా జట్టును అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రతిభగల క్రీడాకారులకు కోదవలేదని, ఎంతోమంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించారని గుర్తుచేశారు. ఫుట్‌బాల్ క్రీడాభివృద్ధికి అన్నివిధాల కృషి చేస్తామని తెలిపారు. కోచ్, మేనేజర్ భానుకిరణ్, గజానంద్, సీనియర్ క్రీడాకారులు రామకృష్ణ, నిఖేష్, నగేష్ పాల్గొన్నారు.జిల్లా బాలికల జట్టు: సోని, శ్రీలత, సరోజ, అరుణమ్మ, శిరీష, జీ శిరీష, మంగమ్మ, మంజుల, సౌమ్య, కవిత, మౌనిక, రూపవతి, కీర్తి, సుజాత,మీనాక్షి, అఖిల, జీ సౌమ్య, శ్రావణి.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...