గ్రామీణ ప్రాంత యువకులకు హబ్ ఏర్పాటు అభినందనీయం

Sat,December 7, 2019 12:08 AM

-మాజీ ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యే సండ్ర
సత్తుపల్లి, నమస్తే తెలంగాణ, డిసెంబరు 6: సత్తుపల్లి వంటి పట్టణ శివారులోని గౌరిగూడెంలో గ్రామీణ ప్రాంత యువతీ, యువకుల కోసం హైదరాబాద్ స్థాయిలో హబ్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, టీఆర్‌ఎస్ నాయకులు మట్టా దయానంద్ విజయ్‌కుమార్‌లు అన్నారు. మండల పరిధిలోని గౌరిగూడెంలో మందపాటి ముత్తారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంఆర్‌హబ్‌ను శుక్రవారం రాత్రి వారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలో లక్షలు ఖర్చుచేసి యువతకు మెరుగైన ఆరోగ్య రక్షణ కోసం ఇలాంటి హబ్‌లు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.

హైదరాబాద్ స్థాయిలో అత్యాధునికమైన టేబుల్ టెన్నిస్, స్నూకర్, ట్రెడ్ మిల్, షటిల్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్‌ఫూల్ తదితర కోర్టులను ఏర్పాటు చేసి యువతీ, యువకులకు ఆరోగ్య రక్షణ కోసం ఉల్లాసానిచ్చే ఇలాంటి హబ్‌లను ఏర్పాటు చేసిన ముత్తారెడ్డిని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డా హైమావతి శంకర్‌రావు, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, గాదె సత్యం, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, కూసంపూడి మహేష్, జగ్గవరపు సంజీవరెడ్డి, కోటగిరి సుధాకర్, మోరంపూడి ప్రసాద్, కిషోర్‌రెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, మందపాటి సత్యనారాయణరెడ్డి, చల్లారి వెంకటేశ్వరరావు, చెన్నకేశవరావు, అత్తులూరి సత్యనారాయణరెడ్డి, పవన్, అద్దంకి అనిల్, షేక్ చాంద్‌పాషా, కమల్‌పాషా, తోట గణేష్, తుంబూరు కృష్ణారెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

254
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles