అవినీతి రహిత సమాజ స్థాపనకు

Thu,December 5, 2019 04:20 AM

-యువత ముందుకు రావాలి : సీపీ
ఖమ్మం క్రైం, డిసెంబర్ 4: అవినీతి రహిత సమాజ స్థాపనకు యువత ముందుకు రావాలని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. దేశ భవిష్కత్తు యువత చేతుల్లోనే ఉందని యువత తలచుకుంటే సాధించలేనిదీ ఏమీలేదని సీపీ పేర్కొన్నారు. అవినీతి వ్యతిరేక వారోత్సవాల సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలోని రిక్కబజార్ స్కూల్ విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీని పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడారు.

అవినీతి రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అవినీతి వలన దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని, అటువంటి వ్యవస్థను ప్రోత్సహించరాదని తెలిపారు. జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అవినీతిపరులపై చేపడుతున్న చర్యలను సీపీ అభినందించారు. అనంతరం ఏసీబీ సీఐ రమణమూర్తి మాట్లాడారు. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక వారోత్సవాలను బుధవారం నుంచి ఈనెల 9 వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఏవరైనా లంచాలకు పాల్పడితే సెల్ ఫోన్ 9440446147, 9440700048, టోల్ ఫ్రీ నెంబర్ 1064లకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యాక్రమంలో ఏసీబీ సీఐ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

302
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles